బీసీలకు తీరని అన్యాయం!
రేవంత్ హామీ ఇచ్చినట్టుగా బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి ఆదర్శంగా నిల వాల్సిన అవసరం ఉంది. కాదని, బీసీలను ఓటు బ్యాంకుగా చూసి కామారెడ్డి డిక్లరేషన్ కు తూట్లు పొడిస్తే రాహుల్‌గాంధీ భారత ప్రధాని అయ్యే కలలు ఎండమావిగానే మిగిలిపోతాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన 1956 నుంచి ఇప్పటి తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు బీసీలు, ఈబీసీలు అనుభవిస్తున్న అన్యాయాల చరి త్ర ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోం ది. పాలకులు మారినా పాలనలో ముఖ్యమంత్రికి ఉన్న సామాజిక వర్గాధిపత్యం, కులాధిపత్యం మాత్రం మారలేదు. రాష్ట్ర నిర్మాణం, రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం అన్నీ మారినప్పటికీ సామాజిక న్యాయం మాత్రం అణగారిన వర్గాలకు అందలేదు. ఈ నేపథ్యంలో 1956 నుంచి ఇప్పటి వరకు పలువురు ముఖ్యమంత్రుల పాలనలో చోటుచేసుకున్న కుల ఆధిపత్యం, బీసీలకు జరిగిన అన్యాయాలను పరిశీలించడం అత్యంత అవసరం.
ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అంజి రెడ్డి (అంజయ్య), కోట్ల విజయభాస్కరరెడ్డి, జనార్ధన్ రెడ్డి, భవనం వెంకట్రామి రెడ్డి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరుల పాలనలో రాజకీయ శక్తి కొన్ని వర్గాలు, ముఖ్యంగా రెడ్డిల చేతుల్లోనే కేంద్రీకృతమైపోయింది. అదే సమయంలో ఎన్టీఆర్, నారా చంద్రబాబు పాలనలో మరో వర్గం (కమ్మ కులాధిపత్యం అన్ని స్థాయిల్లో రాజ్యం చేసింది) ప్రభావం అన్నిచోట్లా విపరీతంగా హద్దూఅదుపూ లేకుండా పెరిగింది. ఈ రెండు దశల్లోనూ బీసీల జనాభా 50 శాతం పైగా ఉన్నప్పటికీ, అసెంబ్లీ, మంత్రివర్గం, కీల క పదవుల్లో వారి ప్రాతినిధ్యం 15 శాతం దాటలేదు.
ఓబీసీల ఆశలు ఆవిరి:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప దేండ్లు కేసీఆర్ పాలన సాగింది. ఈ కాలం లో బీసీలకు న్యాయం జరుగుతుందని భా వించినప్పటికీ, గణాంకాలు మాత్రం భిన్నమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ రాజకీయ, రాజకీయేతర పదవుల్లో, ప్రభుత్వ సలహాదారులతో సహా అన్నింటా వెలమల పెత్తనం సాగింది. 2014, 2018 అసెంబ్లీలలో బీసీ ఎమ్మెల్యేల శాతం 20 శాతమే. మంత్రివర్గంలో కూ డా బీసీల ప్రాతినిధ్యం 15 శాతం దాటలేదు.
ముఖ్యమైన శాఖలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. 2023లో రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక కూడా విద్యారంగంలో బీసీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భారీగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 నాటికి రూ.3,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఉన్నత స్థాయి పోస్టుల్లో బీసీల ప్రాతినిధ్యం 10 శాతం మాత్రమే ఉంది. గ్రూప్- గ్రూప్ ఉద్యోగాల్లో బీసీల ఎంపిక తక్కువగా ఉందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రాధాన్యమే లేదు:
బి.ఎస్. రాములు (బీసీ కమిషన్ పూర్వ చైర్మన్), రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, విద్యావేత్తలు మురళీ మనోహర్, ఆచార్య తిరుమలి, ఆచార్య శ్రీనివాస్ చేసిన పరిశోధనల్లో కూడా బీసీలకు ఇచ్చిన హామీలు అమ లు కాలేదని స్పష్టమైంది. 1980 మధ్యకాలంలో ఉన్నత స్థాయి అధికారుల్లో బీసీల శాతం 10 శాతంలోపే ఉండేది. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో కూడా బీసీలు చాలా తక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలోనూ అసమానతలు కొనసాగుతున్నాయి. బీసీల జనాభా 50 శాతం పైగా ఉన్నప్పటికీ, బడ్జెట్ కేటాయింపులు 10 శాతంలోపే ఉంటున్నది. బీసీ సబ్ ప్లాన్ లేకపోవడం వల్ల నిధుల వినియోగం స్పష్టంగా కనిపించడం లేదు.
అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ స్థానాల్లో వారి శా తం తక్కువగానే ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్ణయాధికారాలు ఇతరుల ఉన్నాయి. ఇటీవల రాజ్యాంగబద్ధమైన సంస్థలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చారనే విషయాన్ని గుర్తించి గవర్నర్ తిరస్కరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్పలకుపోయిన కాంగ్రెస్ వివి ధ కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో 15 శాతం మించలేదు. ఇక సమాచార శాఖ కమిషనర్ల ఎంపికలో బీసీలకు గుండు సున్నాతో తీవ్ర అన్యాయం చేసింది.
అయితే రాష్ట్ర ఏర్పాటు కోసం ఎడతెగని పోరుసల్పిన, సామాజిక తెలంగాణ అవసరం చాటిచెప్పిన ఎందరో అర్హులైన బీసీ అభ్యర్థులున్నా రాజ్యాంగ సంస్థలో తమ పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇచ్చి గవర్నర్ తిరస్కరించే పరిస్థితిని ప్రభుత్వం కొనితెచ్చుకున్నది. రాజ్యాంగ సంస్థలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వా న్ని నిలదీస్తే నిమ్మకు నీరెత్తిన్నట్టు వ్యవహరిస్తున్నది.
తెలంగాణ ఉద్యమం తెలంగాణ:
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పాటు సామాజిక సమానత్వం కూ డా ముఖ్య డిమాండ్‌గా తెలంగాణ ఉద్యమంలో బీసీలు ప్రధాన శక్తిగా నిలిచారు. సా మాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా అవకాశాలు, ఉద్యోగాలు అనే నాలు గు ప్రధాన లక్ష్యాలతో ఈ వర్గాలు పోరాటం చేశాయి. కానీ, పాలకులు మారినా విధానా లు మారలేదు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సలహాదారుల పోస్టులు, అడ్వకేట్ జనరల్ వం టి కీలక పదవుల్లో కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదు. కేసీఆర్ పాలనతో విసిగిపోయి కాంగ్రెస్‌కు పట్టం కడితే బీసీ సమాజానికి ఒరిగిందేమీ లేదు.
హిందూ త్వం పేరుతో మూడవ దఫా పాలిస్తున్న మోదీని గద్దె దించేది బీసీల ఎజెండా , సా మాజిక న్యాయం. రేవంత్ హామీ ఇచ్చినట్టుగా బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి ఆదర్శంగా నిల వాల్సిన అవసరం ఉంది. కాదని, బీసీలను ఓటు బ్యాంకుగా చూసి కామారెడ్డి డిక్లరేషన్ కు తూట్లు పొడిస్తే రాహుల్‌గాంధీ భారత ప్రధాని అయ్యే కలలు ఎండమావిగానే మిగిలిపోతాయి. ఇప్పటికైనా కులగణన గణాం కాల ఆధారంగా చట్టబద్ధంగా బీసీలకు న్యా యం చేయాలి. లేకపోతే రాబోయే ఎన్నికల్లో బీసీలు తమ శక్తిని చాటుకునే దిశగా అడుగులు వేయడం ఖాయం.
వ్యాసకర్త సెల్: 9849328496
డా. కోలాహలం రామ్ కిశోర్




