11 April, 2026 | 3:24 AM

ఫూలే జయంతి ఉత్సవాలకు కమిటీ

11-04-2026 01:25 AM
  1. చైర్మన్‌గా వీ హనుమంతరావు 
  2. సలహాదారులుగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ సహా 8 మంది
  3. నేడు రవీంద్రభారతిలో వేడుక 

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరాఫూలే జయంతి ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కమిటీని ప్రకటించింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు చైర్మన్‌గా, జాజు ల శ్రీనివాస్‌గౌడ్‌తో సహా 8 మందిని సలహాదారులుగా, ప్రొఫెసర్ మల్లేశ్వర్‌తో సహా 15 మందిని కన్వీనర్లుగా, 15 మందిని కోన్వీనర్లుగా, 13 మందిని సభ్యులుగా నియమిం చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

శనివారం ఉదయం 10 గంటలకు రవీంధ్రబారతిలో ఫూలే జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 లక్షలను విడుదల చేసింది. ఫూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌గా వీ హనుమంతరావు, వైస్‌చైర్మన్లుగా చేరికాల రాజేందర్, టీ విక్రమ్ గౌడ్, కాటపల్లి వీరస్వామి, రామ్‌రాజ్ సింగ్, అల్లం భాస్కర్‌లను ఎంపిక చేసింది.

ఉత్సవ సలహాదారులుగా జాజుల శ్రీనివాస్‌గౌడ్, నీల వెంకటేశ్, మేకపోతుల నరేందర్‌గౌడ్, గణేష్‌చారి, గుజ్జ కృష్ణ, జిలకపల్లి అంజి, జగదీష్, సునీతమ్మ, కన్వీనర్స్‌గా అనంతయ్య, పగిల్ల సతీష్, మెదీ రామ్‌దేవ్ యాదవ్, డీ భాస్కర్ ప్రజాపతి, అనురాధగౌడ్, శ్యామ్ కుర్మ, మణిమంజరి, సంగని మల్లేశ్వర్, చంద్రశేఖర్‌గౌడ్, ఇ నిరంజన్, సిరికొండ రామకృష్ణ, బొల్లం లింగమూర్తి పటేల్, పల్లా ప్రదీప్‌గౌడ్, సానే శ్రీనివాస్, వేముల రామకృష్ణలను ప్రభుత్వం నియమించింది.

ఫూలే ఉత్సవ కమిటీ కో కన్వీనర్స్‌గా నిమ్మల వీరన్న, ఏ భీమ్‌రాజు, ఎస్ రామలింగం, నికిల్ పటేల్, కట్కూరి లక్ష్మి, జాజుల లింగమ్‌గౌడ్, గొడుగు మహేష్‌యాదవ్, నంద గోపాల్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, నరేష్ ప్రజాపతి, టీ సత్యనారాయణ, మల్లేష్‌యాదవ్, కాల్వ మధుబాబు రజక, మిద్దెల మళ్లేషం, కొమ్ము శ్రీధర్, సభ్యులుగా లతాసింగ్, శివకుమార్‌యాదవ్, నరేష్‌గౌడ్, రమాదేవి, టీ కౌషిక్, గూడూరు భాస్కర్, వేమల రామకృష్ణ, తారకేశ్వరి, ఎస్ శ్యామ్, సంధ్యారాణి, దుగ్గాని శ్యామల ముదిరాజ్, ఎనగందుల రమేష్, నాగుల మహేష్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.