13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బండరావిరాలలో వివో మహిళా సంఘాల భవన నిర్మాణానికి భూమిపూజ

24-03-2026 12:00 AM

అబ్దుల్లాపూర్ మెట్ , మార్చి 23 : మండలంలోని బండరావిరాల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎన్‌ఆర్‌ఆజిఎస్ రూ. 10లక్షలతో నిర్మిస్తున్న వివో మహిళా సంఘాల భవన నిర్మాణానికి ఎంపీడీఓ శ్రీవాణి ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచ్ కందికంటి విజయ్కుమార్ తో కలసి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళా సంఘాల బలో పేతానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. మహిళలు ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

మహిళల అభివృ ద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించి గ్రా మాల అభివృద్ధికి కృషి చేస్తమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సీసీ సరస్వతి, ఉపసర్పంచ్ దూస శంకర్, వార్డుసభ్యులు కన్నె భరత్, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్, గుండ్ల భవానిశివ, కందికంటి నర్సింగ్ రావు , పంచాయతీ కార్యదర్శి విజయా భాస్కర్, కారోబర్ ఏర్పుల శ్రీశైలం, విఓ అధ్యక్షురాలు బంగారి సుమలత, బిఓఏలు నోముల వరమ్మ, గోద మాధవి, అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి కె లావణ్య, కోశాధికారి బి లావణ్య, కందికంటి వరలక్ష్మీ, బిఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుండ్ల జంగయ్య తదితరులు ఉన్నారు.