3 April, 2026 | 7:09 PM

చీల‌ప‌ల్లిలో ఈద్గాకు భూమి పూజ

03-04-2026 05:36 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): మండ‌లంలోని చీల‌ప‌ల్లి గ్రామంలో ఈద్గా స్థ‌లం లేకపోవ‌డంతో రంజాన్, బ‌క్రిద్ పండుగ  వ‌చ్చిందంటే ముస్లిం సోద‌రులు  గ్రామంలోని మ‌సీదులో ప్రార్థ‌న‌లు  చేసేవారు.. అయితే ఈ విష‌యంపై గ్రామానికి చెందిన ముస్లిం, మైనార్టీలు స్ధ‌లం కోసం చ‌ర్చించారు. దీంతో గ్రామానికి చెందిన ఇమామ్ త‌న వ్య‌వ‌సాయ పొలంలో నుంచి రెండు గుంట‌ల భూమిని ఈద్గా కోసం స్థ‌లాన్ని కేటాయించగా లింగంప‌ల్లి గ్రామానికి చెందిన మ‌క్సూద్ ప‌టేల్ త‌న వంతుగా గోడ కోసం రాయిని అందించ‌గా  మొగ్దుంప‌ల్లి గ్రామానికి చెందిన ర‌సూల్ ప‌టేల్ త‌న వంతుగా సిమెంట్ లోడ్  ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా  గ్రామానికి చెందిన ముస్లిం, మైనార్టీలు వారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.  ఈ భూమి పూజ కార్య‌క్ర‌మంలో  హాజీ,  ఆఫీస్, ఎండీ అప్సర్, ఎండీ షరీఫ్, చోటు, సాజిద్ ప‌టేల్ త‌దిత‌రులు ఉన్నారు.