calender_icon.png 8 February, 2026 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాయం విక్రం రెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

08-02-2026 12:17:36 PM

గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన దాయం విక్రమ్ రెడ్డి

తుంగతుర్తి,( విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ప్రజా నాయకుని సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు కీర్తిశేషులు దాయం విక్రమ్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు పార్టీలకతీతంగా యావత్ గ్రామ ప్రజలు  శుభారంభం చేశారు. ఆదివారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ సమీపంలో దాయం విక్రమ్ రెడ్డి  విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో సంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామ సంక్షేమమే లక్ష్యంగా మన జీవితాంతం సేవలందించిన గొప్ప ప్రజానాయకుడు అని కొనియాడారు. గ్రామానికి విక్రం రెడ్డి చేసిన  పరిపాలన నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ప్రజా ఉద్యమాలు, కార్మిక-రైతు హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుని సేవలను స్మరించుకుంటూ విగ్రహం ఏర్పాటు చేయడం గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, విక్రమ్ రెడ్డి సతీమణి మాజీ ఎంపిటిసి దాయం సుజాత, కూతురు దాయం ఝాన్సీ రాజీ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ గుండగాని వీరస్వామి,మాజీ సర్పంచ్ కొండగడుపుల నాగయ్య,మాజీ ఉప సర్పంచ్ భాష బోయిన వెంకన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదర బోయిన రవి, తప్పట్ల శంకర్, బిఆర్ఎస్ పార్టీ మహిళా కమిటీ మండల అధ్యక్షురాలు తునికి లక్ష్మి, గాజుల యాదగిరి, అభిమానులు, గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.