9 April, 2026 | 3:15 AM

బొడ్రాయికి భూమిపూజ

09-04-2026 12:49 AM

జనగామ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తరిగొప్పుల మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో సర్పంచి బైకానీ రమ బాలరాజ్ ఆధ్వర్యంలో గ్రామంలో బొడ్రాయి కి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించే పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, గ్రామ ప్రజల సహకారంతో ముందుకెళ్తూ ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క  కార్యక్రమాన్ని ఒక్క యజ్ఞంలా నిర్వహిస్తామని తెలిపారు.

ప్రతి ఒక్కరు దైవ కృపకు తోడ్పడాలని, గ్రామదేవతల ఆశీస్సులు ఎప్పుడూ గ్రామంపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగపూర్ కిషన్ గౌడ్, గ్రామ పురోహితులు ఎర్రోజు భాస్కరాచార్యులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.