నూతన మార్కెట్ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన
పాల్గొన్న ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డు నందు కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో నూతన మార్కెట్ కార్యాలయ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. గురువారం చిట్యాల మార్కెట్ యార్డ్ నందు నూతన మార్కెట్ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ లో రూ.1 కోటి వ్యయంతో మార్కెట్ కార్యాలయం, 65 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, నిన్నటి వరకు చిట్యాల మండలంలోని 11 గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉండేవని, ఇక నుండి ఆ 11 గ్రామాలను చిట్యాల మార్కెట్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆయన తెలిపారు.
చిట్యాల మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్వవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైయిరీ చెర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నర్రా వినోద-మోహన్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ పందిరి గీత-రమేష్, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్ లు నాయకులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి జానయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




