26 May, 2026 | 1:25 PM

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన

26-05-2026 12:54 PM

షాద్ నగర్ ఆర్డీఓ సరిత వినతిపత్రం సమర్పిస్థున్న కాంగ్రెస్ పార్టీ నేతలు 

షాద్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం(Central Government) పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనె తగ్గించాలని డిమాండ్   చేస్తు మంగళవారం  షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్ నగర్ ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా  మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయని అగ్గనూర్ బసవేశ్వర్ అన్నారు.  కేంద్రంలో  ఉన్న  బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప  పేద ప్రజల సంక్షేమం ఏనాడు పట్టించుకోవడంలేదని, ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి మోడి పెట్రోల్, డీజిల్ ధరల విషయం మాట్లాడలేదని అన్నారు. 

గిరిజన ఆదివాసి రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు నాయక్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన తమిళనాడు, కేరళ మరియు పచ్చిమబెంగాల్ ఎన్నికల పూర్తి అయిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని రఘు నాయక్ ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వం దేశ  ప్రజలు ఎవ్వరు విలాసవంతాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిందని దీని అర్ధం మన దేశ ఆర్ధిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిందని భావించవచ్చని రఘు నాయక్ అన్నారు. రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్న మోడి  మాత్రం నిద్ర లేవడం లేదని రఘు నాయక్ ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో అన్ని మండల పార్టీ అధ్యక్షుడు లు, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు వైస్ ఛైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్, నియోజకవర్గ అని మండలల వివద గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్,మాజీ ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు