26 May, 2026 | 1:40 PM

బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం

26-05-2026 01:05 PM

డిసిపిఓ బూర్ల మహేష్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామపంచాయతీలో నిర్వహించిన “బాల్య వివాహ ముక్త్ భారత్” కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి బూర్ల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం మొత్తం కృషి చేయాలని, బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరపాలని సూచించారు.పిల్లల రక్షణ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పిల్లలపై హింస నివారణలో గ్రామస్థాయి బాల సంరక్షణ కమిటీలు కీలకంగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లైలా, పంచాయతీ కార్యదర్శి శ్వేత, కౌన్సిలర్ చంద్రశేఖర్, యుక్తవయసు బాలికలు, వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.