26 May, 2026 | 1:51 PM

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే

26-05-2026 12:56 PM

బి.ఆర్.ఎస్ యూత్ నాయకులు 

సుల్తానాబాద్, మే 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad, Peddapalli District) పట్టణాన్ని 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దే అని  బి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు వహీద్  అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పని చేసిన దాసరి మనోహర్ రెడ్డి  సుల్తానాబాద్ పట్టణం లో 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని ,అందులో 3 కోట్ల సిడిపి నిధులతో  సి.సి.రోడ్లు, 5 కోట్ల రూపాయలతో 35 పడకల ప్రభుత్వ ఆసుపత్రి , సుల్తానాబాద్ పట్టణం నుండి వివిధ గ్రామాలకు పలు బిటి రోడ్లు , పట్టణంలోని వివిధ కూడళ్లలో హై మాస్ లైట్లు, ఇందులో పలు అభివృద్ధి పనులు 11 కోట్ల టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులతో నిర్వహించారని అన్నారు,  కేవలం సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధి చెందింది బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో దాసరి మనోహర్ రెడ్డి  వల్లనే ఆయన పేర్కొన్నారు.

అనంతరం యూత్ వైస్ ప్రెసిడెంట్ గాజుల అరుణ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం లో వడ్లు కొనుగోలు జరగక రైతులు ఇబ్బంది పడుతున్నారని వాటిని ప్రశ్నిస్తే ప్రజల దృష్టి మరల్చే విధంగా పెద్దపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణ రావు వారి అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని , ప్రస్తుత ఎమ్మెల్యే వెంటనే  ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తరలింపుకు సరిపడ లారీలను సమకూర్చి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు సకాలంలో వారి అకౌంట్లో  డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు....ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ 6 వార్డు యూత్ ప్రెసిడెంట్ ఆరేపల్లి ప్రశాంత్,12 వార్డు ప్రెసిడెంట్ ఎం.డి సల్మాన్, యూత్ నాయకులు చిటికెల పరమేష్ , కందునూరి కిరణ్, మైనారిటీ యూత్ ప్రెసిడెంట్ ఎస్.కె షకీల్, నాయకులు పాల్గొన్నారు...