9 April, 2026 | 3:14 PM

వివి రావుపేట లో బడిబాట కార్యక్రమం

09-04-2026 01:29 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం వివి రావుపేటలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మన ఊరు – మన బడి నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు స్కాలర్‌షిప్‌ల వంటి అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకొని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఎఎపిసి చైర్మన్, సభ్యులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.