26 May, 2026 | 1:17 PM

తాళం వేసిన ఇంట్లో చోరీ

26-05-2026 12:12 PM

షాద్ నగర్ మే 26 (విజయక్రాంతి): తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్ లో చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ రోడ్ లో అద్దెకుంటున్న కుమార్ బంధువుల ఇంటికి వెళ్ళాడు. తిరిగి ఈరోజు తెల్లవారుజామున ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చేసేసరికి బంగారం,వెండి ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు,క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.