పిట్లం కమ్యూనిటీ ఆసుపత్రి ప్రారంభానికి అంకురార్పణ
సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించిన జుక్కల్ శాసనసభ్యులు
నిజాంసాగర్, మే 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నిర్మించిన కమ్యూనిటీ ఆసుపత్రి ప్రారంభానికి అంకురార్పణ జరిగింది. సోమవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈనెల 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్, బుగుడాల నవీన్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిలు అధికారులు పాల్గొన్నారు.






