సుల్తానాబాద్‌లో రూ.12 కోట్లతో నిర్మించే మినీ ట్యాంక్‌బండ్‌కు శంకుస్థాపన
- త్వరలోనే మున్సిపాలిటీ, ఆర్‌అండ్ బి గెస్ట్ హౌస్‌లకు భవనాల నిర్మాణం..
- ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
సుల్తానాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా నిర్మించేందుకు రూ.12 కోట్ల నిధులతో చేపట్టే పనులకు చెరువు వద్ద మంగళ వారం సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా చై ర్మన్ బిరుదు రాధాకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజ యరమణ రావు మాట్లాడుతూ...చాలా కా లంగా ప్రజలు ఎదురుచూస్తున్న చెరువు అభివృద్ధి వల్ల సుల్తానాబాద్ తో పాటు ప లు గ్రామాల పంట పొలాలకు ఆయకట్టు స్థిరీకరణపెరుగుతుందన్నారు.
అలాగే కట్ట అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకుగాను టూరిజం శాఖతో రూ. మరో 2 కోట్ల నిధులను మంజూరీ చేయిస్తానన్నారు. ఇప్పటికే పట్టణంలో ప్రధాన రోడ్ల ను వెడల్పు చేసి సిసి రోడ్లుగా అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు శ్రమించడం జరుగుతుందన్నారు, తాను పు ట్టింది శివపల్లి గ్రామంలో అయినప్పటికీ పె రిగింది మాత్రం సుల్తానాబాద్ లోనే అని అ న్నారు. అందుకే సుల్తానాబాద్ పై తనకు మ మకారం ఉందన్నారు.సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.ఇచ్చిన హామీలతో పా టు ఇవ్వని హామీలను కూడా కార్యరూపంలోకి తీసుకు వస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి హామీలు తీర్చి ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్ , కౌన్సిలర్ గాదాసు మంజుల తో పాటు పట్టణ కౌన్సిలర్లు, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ, డిఈఈ, ఏఈ, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






