12 May, 2026 | 3:51 PM

గ్రూప్-1 అటెండెన్స్ 74.86 శాతం

22-06-2024 12:05 AM

0.86 శాతం పెరిగిన హాజరు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ఈనెల 9న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 74.86 శాతం మంది హాజరైనట్లు టీజీపీఎస్సీ శుక్రవారం తుది హాజరు శాతాన్ని ప్రకటించింది. పరీక్ష జరిగిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3.02 (74 శాతం) లక్షల మంది హాజరైనట్లు అప్పట్లో వెల్లడించింది. కచ్చితమైన లెక్కలను అప్పట్లో ఇవ్వకపోవడంతో తాజాగా మళ్లీప్పుడు తుది హాజరుశాతాన్ని ప్రకటిస్తూ ఒక ప్రకటన విడు దల చేసింది. గతంలో గ్రూప్-1 రద్దయినప్పుడు హాజరుశాతంలో తేడా రావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం నేపథ్యంలో గ్రూప్-1 నిర్వహణ పారదర్శకంలో భాగంగా టీజీపీ ఎస్సీ ఈమేరకు తుది లెక్కలను అధికారులు విడుదల చేశారు. అప్పటికి ఇప్పటికీ 0.86 శాతం హాజరు పెరిగింది. 4,03,645 మందికి గానూ 3,02,172 (74.86 శాతం) మంది పరీక్ష రాసినట్లు కమిషన్ తెలిపింది. ఓఎంఆర్ షీట్స్ సైతం ఈనెల 24 నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.