కోర్టు కమిషన్‌కు సంజయ్ రావాల్సిందే
లేదంటే పిటిషన్‌ను మూసేస్తామన్న హైకోర్టు
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ అడ్వొకేట్ కమిషన్ ఎదుట కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. కమిషన్ ముందు హాజరై సాక్ష్యం ఇవ్వాలని, లేకపోతే పిటిషన్‌ను మూసివేస్తామని స్పష్టం చేసింది. విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. గంగుల కమలాకర్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, పరిమితికి మించి ఖర్చు పెట్టారని సంజయ్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల సాక్ష్యాల నమోదుకు జిల్లా మాజీ జడ్జి కే శైలజను అడ్వొకేట్ కమిషన్‌గా హైకోర్టు నియమించింది. సంజయ్ పలు వాయిదాలు కోరుతూ వచ్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ రాధారాణి శుక్రవారం విచారణ జరిపినప్పుడు, సంజయ్ లాయర్ వాదిస్తూ పిటిషనర్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కారణంగా బిజీగా ఉన్నారని, గడువు కావాలని కోరారు.






