12 May, 2026 | 2:46 PM

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం

22-06-2024 12:05 AM

సచివాలయంలో మహిళాశక్తి క్యాంటీన్ల ఓపెనింగ్‌లో మంత్రి సీతక్క

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): గ్రామీణ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో  ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి శాంతికుమారితో కలిసి మహిళాశక్తి క్యాంటీన్లను ప్రారంభించారు.  క్యాంటీన్తు ఒక బ్రాండ్‌గా  దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పల్లెరుచులు ఇప్ప పువ్వు, లడ్దూలు, నన్నారి వంటి సాంప్రదాయ ఆహార పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని సూచించారు.  రానున్న రెండేళ్లలో  రాష్ట్రంలో 151 క్యాంటీన్ల ఏర్పాటే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని తెలిపారు.

స్థానికంగా లభ్యమయ్యే వనరులు, వస్తువుల ఆధారంగా ప్రజల అవస రాలకు తగ్గట్టుగా మహిళాశక్తి బిజినెస్ మోడల్స్ గుర్తించామన్నారు. వాటిలో ప్రధానమైనవి ఆధార్ కేంద్రాలు, మీ   సేవా సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వం అన్ని రకాలు ప్రోత్సాహం అందించండంతో పాట వడ్డీలేని రుణ సౌకర్యం కూడా కల్పిస్తుంద న్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ముఖ్యమంత్రి కార్యదర్శులు మానిక్ రాజ్, చంద్ర శేఖరరెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాలరావు, అధికారులు నర్సింహరెడ్డి, సునీత రెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.