గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
07-07-2024 12:19 PM
హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ తుది కీతో పాటు ఫలితాలు విడుదల చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత సాధించారు. 1:50 రేషియోలో గ్రూప్-1 మెయిన్స్కి అభ్యర్థుల ఎంపిక చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను www.tspsc.gov.in వెబ్సైట్లో పెట్టింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు.






