చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
07-07-2024 12:38 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు చంద్రబాబు ర్యాలీ కొనసాగింది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. దీంతో చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు సన్మానం చేయనున్నారు. బోనాలతో చంద్రబాబు ర్యాలీలో పార్టీ నేతలు పాల్గొన్నారు.






