15 March, 2026 | 2:26 AM

నర్సరీలో మక్కజొన్న సాగు!

15-03-2026 12:00 AM

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం కస్నాతండా పంచాయతీకి చెందిన నర్సరీలో హరితహారం మొక్కలకు బదులు మక్కజొన్న పంట సాగుచేస్తున్నారు. గ్రామ పంచాయతీ నిధులతో నర్సరీకి ఏర్పాటు చేసిన గేటు కూడా మక్కజొన్న పంటకు కాపలా కాస్తున్నది. నర్సరీ స్థలంలో మక్కజొన్న పంట ఉండటం చూసి రోడ్డు వెంట పోతున్నవారంతా ఇదేమిటి ఇక్కడ మొక్కలు కదా ఉండాల్సింది అంటూ మక్కజొన్న పంటను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయినా అధికారులకు మాత్రం ఈ విషయంపై పెద్దగా పట్టింపు లేకుండా పోయిందనే విమర్శలు వినవస్తున్నాయి. 

 బండి సంపత్‌కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి