ఆర్థిక నిపుణులకు అభినందనలు
02-06-2024 12:05 AM
స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కూడా అన్ని అంచనాలను మించిన వృద్ధి రేటును సాధించినందుకు ఆయా రంగాల ఆర్థిక నిపుణులను అభినందించక తప్పదు. ఈ సంవత్సరం వరుసగా మూడోమారు ఇండియా 7 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. 2024 సంవత్సరం జీడీపీ వృద్ధి 8.2 శాతంగా వెలువడింది. దీనిపట్ల నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌సహా పలువురు ఆర్థికవేత్తలు ప్రశంసలు వెలిబుచ్చారు.
-విశ్వనాథమ్.ఆర్., కూచన్‌పల్లి






