4 May, 2026 | 12:12 AM

బ్యాంకులను నమ్మేదెలా?

02-06-2024 12:05 AM

అపెక్స్ బ్యాంక్ అధిక వడ్డీ ఆశ చూపి పలువురు వినియోగదారుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి, బోర్డు తిప్పేసిన వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొత్తం సుమారు రూ. 250 కోట్లు ఆగమైనట్టు వార్తలు వచ్చాయి. రానురాను అసలు, బ్యాంకులను ఎలా నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నది. అయినా, మరోపక్క ఇప్పటికీ అనేకమంది అమాయకులు సిబ్బంది మాయమాటలు నమ్మి మోసపోతుండటం దురదృష్టకరం. ఇప్పటికైనా అధిక వడ్డీల కోసం ప్రజలు ఆశ పడకుండా ఏండ్ల తరబడి కష్టపడి కూడపెట్టుకొని, సంపాదించుకున్న డబ్బును కాపాడుకోవాలి. రిజర్వ్ బ్యాంకు నిబంధనలను మరింత కఠినతరం చేయాలి.

-మల్లికార్జున్‌రెడ్డి, నిర్మల్