18-02-2026 01:37:23 AM
సాగుభూములన్నింటికి ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : యాసంగిలో వరినాట్లు పూర్తి కావస్తున్నాయి.. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సాయం అందిస్తే యాసంగిలో తమకు ఆసరాగా ఉంటుందని భావిస్తున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి ఒకే విడతలో రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమచేస్తామని చెబుతున్నా.. నిధులు జమచేయడంలో ఆలస్యమవుతోంది. సర్కార్ నుంచి పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో.. రైతన్నలు ప్రయివేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత భరోసా వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ, రైతు భరోసా నిధులు విడుద లకు మరో వారం, పది రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. 1,45,73,000 ఎకరాలకు నిధులు అందజేశారు. ఈ యాసంగిలోనూ వానాకాలంలో సాగైన భూములకు భరోసా అందించాలని ప్రభు త్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ. 9వేల కోట్లను సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. సాగు భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాసంగిలో సాగుచేయని భూములకు ఇస్తారా? ఇవ్వ రా? అనే సందేహం రైతుల్లో నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం వానాకాలంలో సాగైన భూములను పరిగణలోకి తీసుకొని అందరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులకు సైతం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
పంట విస్తీర్ణం లెక్కింపు..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రా ల ఆధారంగా ప్రతి గ్రామంలోని సర్వే నంబర్ వారిగా పంటల విస్తీర్ణాన్ని స్విట్జర్ ల్యాండ్ లోని శాటిలైట్ చిత్రాల విశ్లేషణ సంస్థ ‘సర్ మ్యాప్’ (ఎస్‌ఏఆర్ ఎంఏపీ)తో ఒప్పందం చేసుకొని ప్రారంభించింది. రెవె న్యూ గ్రామాలలో శాటిలైట్ ఆధారిత పంట లెక్కింపు పూర్తిచేసింది. అందుకు సంబంధించిన అన్ని జిల్లాల్లో పంటల విస్తీ ర్ణం లెక్కింపునకు సంబంధించిననివేదిక ను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.
పంటల బీమా అమలులో నష్టపోయి న ప్రతి రైతుకు బీమా పరిహారం అందించే అవకాశం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనుగోలులో పారదర్శకత తో పాటు సకాలంలో అమలుచేసే వీలు ఉంటుందని, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో అర్హతగల ప్రతి రైతుకి పథకాలు చేరే విధంగా ఉపయోగపడనుంది.
తగ్గిన పంటల సాగు విస్తీర్ణం..
గత ఖరీఫ్ సీజన్‌లో సాగయ్యే వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా పంటల నమోదు చేసినట్లు సమాచారం. వానాకాలంలో 2.50 లక్షల ఎకరాల నుంచి 3 లక్ష ల ఎకరాలు తగ్గింది. అయితే పంటల విస్తీ ర్ణం ఎందుకు తగ్గిందనే దానిపై యూనివర్సిటీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
ఆ భూములు సాగుచేయకుండా కమర్షియల్‌గా వినియోగిస్తున్నా రని అందుకే అధి కారులు ఆ భూములను భరోసా పథకం నుంచి తొలగించినట్లు నివేదికలో పేర్కొన్నారు. వారం పదిరోజుల్లో రైతుల ఖాతా ల్లో భరోసా నిధులు జమకాబోతున్నాయ ని, అందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.