03-02-2026 01:24:11 AM
రెసోనెన్స్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థు లకు అందుబాటులో ఉన్న వివిధ వృత్తిపరమైన అవకాశాలపై అవగాహన కల్పించేందు కు రెసోనెన్స్ జూనియర్ కళాశాలలు నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో ‘కెరీర్ క్లారిటీ కాన్‌క్ల్లేవ్ అండ్ ఎక్స్‌పో 2026’ నిర్వహించాయి. కెరీర్ మార్గాలు - భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన సరైన వృత్తి మార్గాలు, కోర్సుల ఎంపిక - ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, టెక్నాలజీ, ఇతర అనుబంధ రంగాలలో కోర్సుల ప్రాధాన్యత, పోటీ పరీక్షలు - వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విధా నం, అడ్మిషన్ల అవగాహన ప్రీమియర్ విద్యాసంస్థల్లో ప్రవేశ ప్రక్రియలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఐఐఐటీ డీన్ రమేష్ లోగనాథన్ మాట్లాడుతూ అభిరుచి, ప్రాథమిక అంశాల పట్ల ఉన్న అవగాహన ఆధారంగా కంప్యూటర్ సైన్స్ను ఎంచుకోవాలన్నారు. గీతం యూనివర్సిటీ కోర్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ రామశాస్త్రి వేదుల మాట్లాడుతూ.. కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో కెరీర్ నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తాయని ఎక్స్‌టవేవ్ కో-ఫౌండర్, సీఈఓ రాహుల్ అత్తులూరి అన్నారు. ఎంబీబీఎస్ దీర్ఘకాలిక నిబద్ధతతో కూడుకున్నదని యశోద హాస్పిటల్స్ డాక్టర్ బీ బాల రాజు అన్నారు. ఇంజనీ రింగ్, మెడిసిన్ కాకుండా ఇతర వృత్తిపరమైన అవకాశాలు వేగంగా పెరుగుతున్నా యని ఐసీఎఫ్‌ఏఐ డైరెక్టర్ సుధాకర్ రావు తెలిపారు.
విద్యార్థుల ఆశయాలకు, వాస్తవ ప్రపంచంలో ఉన్న అవకాశాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకే ఈ ’కెరీర్ క్లారిటీ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పో రూపొందించామని రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ, ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా రెసో నెన్స్ విద్యా సంస్థలు మెగా రెసోఫాస్ట్ విజేతలను సత్కరించారు. విశిష్ట అతిథుల చేతుల మీదుగా విజేతలకు ట్యాబ్స్ అందజేశారు. కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులపై సమగ్ర విశ్లేషణ అందించారు. దీనికి ఐఐఐటీ డీన్ రమేష్ లోగనాథన్ ప్రధాన వక్తగా వ్యవహరించారు.
కార్యక్రమంలో సీఎస్‌ఐఎస్ హెడ్, బిట్స్ పిలానీ (హైదరాబాద్) ప్రొఫెసర్ చిత్తరంజన్ హోతా, ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ బిజినెస్ మేనేజర్ సుస్మిత కాలే, గీతం డీమ్డ్ యూనివర్సిటీ కోర్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ రామశాస్త్రి వేదుల, మారుత్ డ్రో న్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, కో-ఫౌండర్ ప్రేమ్ కుమార్ విస్లావత్, ఐఐఎం అహ్మదాబాద్ బోర్డ్ మెంబర్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ వెంకటేష్ పల్లభట్లచ నెక్స్టే్వవ్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ రాహుల్ అత్తులూరి, వీఐటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ నటరాజన్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సీవీ టోమీ, యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బీ బాల రాజు, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ (మార్కెటింగ్), కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ డాక్టర్ బండి విశ్వనాథ్, హెచ్‌ఆర్ బయోలాజికల్ లిమిటెడ్ జీఎం జొన్నలగడ్డ సురేష్, ఐసీఎఫ్‌ఏఐ డైరెక్టర్ ఆఫ్ బ్రాండింగ్ సుధాకర్ రావు, స్టూడెంట్ ట్రైబ్ ఫౌండర్ అండ్ సీఈఓ చరణ్ లక్కరాజు, మీడియా ప్రొఫెషనల్ అండ్ టెడెక్స్ స్పీకర్ సురేష్ కొచ్చాటిల్ పాల్గొన్నారు.