03-02-2026 01:23:32 AM
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్‌యాదవ్
జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 2(విజయక్రాంతి): ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకే వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టామని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని హిమకిర్తి అపార్ట్మెంట్, కల్యాణ్‌నగర్ వెంచర్ 3లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రజలు లిఖిపూర్వకంగా ఇచ్చిన వినతి పత్రాలను ఎమ్మెల్యే స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత సమస్యల గురించి అధికారులతో మాట్లాడారు. దశలవారీగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సహకారంతో ఎర్రగడ్డ డివిజన్, కల్యాణ్ నగర్ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.