calender_icon.png 3 May, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లేఆఫ్స్‌కు చేరువగా గుజరాత్ టైటాన్స్

03-05-2025 02:21:48 AM

  1. 38 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి
  2. నేడు చెన్నైతో బెంగళూరు ‘ఢీ’

అహ్మదాబాద్, మే 2: ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది.

కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76), జాస్ బట్లర్ (37 బంతుల్లో 64) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అలరించారు. ఓపెనర్ సాయి సుదర్శన్ (48) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్లలో ఉనాద్కట్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

అభిషేక్ శర్మ (74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్ (23) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ చెరో 2 వికెట్లు తీయగా.. కోయెట్జే, ఇషాంత్ శర్మ చెరొక వికెట్ తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.