04-05-2025 01:00:16 AM
2 పరుగుల తేడాతో చెన్నై ఓటమి
బెంగళూరు, మే 3: ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆ ఫ్స్‌కు మరింత చేరువైంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రెండు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
కోహ్లీ (62), జాకబ్ బెతెల్ (55) అర్థసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (14 బంతుల్లోనే 53 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించాడు. చెన్నై బౌలర్లలో పతీరానా 3 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కర్రన్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఆయుశ్ మత్రే (87) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. జడేజా (77 నాటౌట్) ఆఖరి వరకు ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు.