కేసీఆర్, కేటీఆర్‌కు శిక్ష పడాల్సిందే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాలి
ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) పై ఫిర్యాదు చేసినందుకు నాపై తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(BJP MP Konda Vishweshwar Reddy) స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ నిరూపించేందుకు అవసరమైతే కేంద్రం సాయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
గతంలో నా ఫోన్ చాలాసార్లు ట్యాప్ అయింది.. ఫోన్ ట్యాపింగ్ పై నేను గతంలో ఫిర్యాదు చేశానని ఆయన వివరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మళ్లీ ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉండాలంటే కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), కేటీఆర్ కు శిక్షపడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రభాకర్ రావు, ప్రణీత్‌రావుల విచారణలో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. సిట్ బృందం(SIT team) ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తుంది. ప్రభాకర్ రావు టీమ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి.






