11 May, 2026 | 8:41 PM

Breaking News

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం   •   కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •   గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు   •  

జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా గుండు రామాంజి గౌడ్

11-05-2026 07:46 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ ఎంపికయ్యారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు  కాయితి ఆశాదీప్ రెడ్డి సోమవారం సంబంధించిన నియామక పత్రం అందజేశారు.​ కాంగ్రెస్ పార్టీలో  చూరుకైన నాయకుడిగా రామాంజి గౌడ్ గుర్తింపు పొందారు.​గరిడపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..

​జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా..

వివిధ హోదాల్లో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేశారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద మంచి గుర్తింపు పొందిన రామాంజి గౌడ్‌కు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రామాంజి గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.​ కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డికి,​తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కి ​నాయకులు సర్వోత్తమ్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, వేనారెడ్డికి, ​జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు, హుజూర్ నగర్ నియోజకవర్గ,గరిడే పల్లి మండల నాయకులకు, సర్పంచులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ,గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.