27న గోల్కొండలో గన్నర్స్ సోల్జరథాన్
హైదరాబాద్, సెప్టెంబర్ 2: భారతదేశపు అతిపెద్ద ఫిట్నెస్ కమ్యూనిటీ అయిన ఫిటిస్తాన్, ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్(Gunners Soldierathon)ను సెప్టెంబర్ 27న గోల్కొండలోని ఆర్టిలరీ సెం టర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ రెండవ ఎడిషన్ గన్నర్స్ సోల్జరథాన్‌ను ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్నర్ల ధైర్యం, నిబద్ధత, త్యాగాలను గుర్తిస్తూ నిర్వహిస్తున్నారు.
గన్నర్స్ సోల్జరథాన్ అనేది ఒకలో తైన ఉద్ద్ధేశ్యంతో కూడిన ఫిట్నెస్ వేడుకనీ, ప్రజలకు, సాయుధ దళాలకు మధ్య వారధిని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుందనీ. వ్యవస్థాపకురాలు శిల్పా భగత్ చెప్పారు. ఆర్టిలరీ రెజిమెంట్ రెండు శతాబ్దాల ధైర్యం, త్యాగం, సేవా వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరు వ చేయడానికి గన్నర్స్ సోల్జరథాన్ తమ మార్గమని మేజర్ డాక్టర్ సురేంద్ర పూని యా తెలిపారు. ఈ రేస్ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10 కి.మీ. పరుగు, 5 కి.మీ. పరుగు/నడక, 1 కి.మీ. గన్నర్స్ డే సెలబ్రేషన్ వాక్ మరియు చీర్ బడ్డీ కేటగిరీ ఉన్నాయి. 1 కి.మీ. సెలబ్రేషన్ వాక్‌లో మూడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవా రు పాల్గొనవచ్చు.






