4 September, 2026 | 7:15 AM

టీమిండియా కోచ్‌గా లక్ష్మణ్

04-09-2026 | 05:40am

ఆసియా క్రీడలకు బాధ్యతలు

కేంద్ర క్రీడా శాఖ ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనబోయే భారత పు రుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఎంపికయ్యాడు. జపాన్‌లో ని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జరగనున్న ఈ ప్ర తిష్టాత్మక క్రీడల కోసం కేంద్ర క్రీడల శాఖ ఈ మేరకు అధికారిక ఆమోదం తెలిపింది.

టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Head Coach Gautam Gambhir) అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ లో బిజీగా ఉండనున్నాడు. అందువల్ల గంభీర్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలు చేపట్టనున్నా డు. ఆసియా క్రీడలకు లక్ష్మణ్ కోచ్‌గా వెళ్లడం ఇది రెండోసారి. గ తంలో 2023లో చైనా వేదికగా జరిగిన పో టీలకూ అతడే కోచ్‌గా వ్యవహరించాడు. అ ప్పుడు భారత్ జట్టు గోల్ మెడల్ సాధించింది. ఆ తర్వాత పలు సిరీస్‌లకు గంభీర్ స్థా నంలో లక్ష్మణ్ మార్గదర్శకుడిగా వెళ్లాడు.