29 July, 2026 | 10:51 PM

వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

29-07-2026 10:29 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా దేవస్థానం రాయగిరి సాయిబాబా దేవస్థానంలో  గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, కాకాడ హారతి, పల్లకీ సేవలు నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథుడికి పంచామృతాలతో పాటు 108 లీటర్ల పాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. పూర్ణచందర్రావు శ్వాస మీద  ధ్యాస కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి ధ్యానం చేయించారు. డాక్టర్ మేఘ మురళి సాయిబాబా యొక్క దైవత్వం గురించి భక్తులకు వివరించారు. అనంతరం ప్రత్యేక భజనలు, సాయి నామ సంకీర్తనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.