జానపద కళారత్న డా.తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ అస్తమయం
29-07-2026 10:43 PM
బోధన్,(విజయక్రాంతి): ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన ప్రముఖ జానపద కళారత్న డా.తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్ గుండె సంబంధిత వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రచనలు ప్రజల్లో స్ఫూర్తిని నింపాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.






