29 July, 2026 | 11:02 PM

పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల ఆశలు చిగురించే

29-07-2026 10:31 PM

పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఏలినో ప్రభావం వల్ల సాధారణ వాతావరణం తగ్గడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. గత రెండు రోజుల నుండి వాయుగుండం ప్రభావం ఏర్పడడంతో పోచారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీనితో మొన్నటి వరకు భయాందోళన ఉన్న రైతులు ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. ఇక డోకా లేదు సమృద్ధిగా పంటలు పండుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీనితో రెండు రోజుల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పోచారం ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.బుధవారం ఉదయం 6 గంటల నాటికి ప్రాజెక్టు నీటి మట్టం 0.470 టీఎంసీల నీరు చేరింది. మొత్తం సామర్థ్యం 1.820 టీఎంసీలు.ప్రాజెక్టులోకి సగటున 5,377 క్యూసెక్కుల నీరు వరద వస్తుందని డిఈఈ కిష్టయ్య తెలిపారు.ఇంతే మీరా వరద ప్రభావం ప్రాజెక్టులోనికి వస్తే రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందని తెలిపారు.