సోయం రాజబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఉప్పల వెంకటరమణ
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొమ్ముగుడెం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు సోయం రాజబాబు ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, బి.ఆర్.ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ ఉప్పల వెంకటరమణ సోయం రాజబాబు చిత్రపటానికీ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం సోయం రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శిoచి మనోధైర్యం నింపి, బి.ఆర్.ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ లో నిబద్దత తో క్రమశిక్షణ కలిగిన సోయం రాజబాబు మరణం పార్టీకి తీరని లోటని వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం , సీనియర్ నాయకులు పగడాల నరేందర్, మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్, సోయం ఎర్రయ్య, ఉప సర్పంచ్ బుద్దుల శ్రీను, కృష్ణ , సోయం సత్యనారాయణ, వంశీకృష్ణ, బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, తధితరులు పాల్గొన్నారు.






