29 July, 2026 | 11:15 PM

శ్రీ గురు పీఠంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

29-07-2026 10:42 PM

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి,

గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి 

శివంపేట్,(విజయక్రాంతి): గురుపౌర్ణమి సందర్భంగా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠం శ్రీ దత్తాత్రేయ , శ్రీ సాయిబాబా దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ గురుపీఠం ఫౌండర్-చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, ట్రస్ట్ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో వేదపండితులు వామన శర్మ, ఆలయ పూజారులు హర్ష శర్మ, నటరాజ శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య గురుపౌర్ణమి విశేష పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలయ అర్చకుల నుంచి ఆశీర్వాదాలు స్వీకరించి రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.