రెవెన్యూ కార్యాలయంలో బోరు వేయించిన సర్పంచ్ పగడాల రమాదేవి
29-07-2026 10:21 PM
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో నీటి సమస్య తీర్చేందుకు దమ్మపేట సర్పంచ్ నూతన మంచినీటి బోరు వేయించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ (అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్)మద్దినేని మురళీ, సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు, చిన్నశెట్టి ముక్తేశ్వరావు, రెవిన్యూ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






