ఈత వనం నాటడంతో కులవృత్తి ఎంతో ఉపయోగం
21-07-2026 05:20 PM
పర్యావరణంతో భావితరాలకు మేలు
జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుందా రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణతో భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈతవనాలను నాటారు. ఈత వనాలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధికి ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు.






