calender_icon.png 7 July, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుదేవోభవ తెలంగాణ బోనాలు

07-07-2025 12:00:00 AM

  1. రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహణ
  2. హాజరైన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): రవీంద్రభారతిలో ఆదివారం నృత్యమల నాట్యకళ వెల్ఫేర్ సొసైటీ, శ్రీ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ వీరేశ్ సంయుక్తంగా గురు దేవోభవ తెలంగాణ బోనాల సంబరాలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు.

కళలకు భారతదేశం పుట్టినిల్లు అని, విద్యార్థులకు చదువుతో పాటు కళలను నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని ఆయన అన్నారు. వేద భూమి, కర్మ భూమి అయిన భారతదేశం.. ప్రధాని మోదీ నాయకత్వంలో సరికొత్త పుంతలు తొక్కుతోంది అని కొనియాడారు. 50 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాల సరసన 35-40వ ర్యాంకులో ఉన్న మన దేశం, మోదీ ప్రధాని అయ్యాక నాలు గో ర్యాంకుకు ఎదిగిందన్నారు.

భవిష్యత్తులో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. పిల్లలకు తప్పనిసరిగా విద్యతో పాటు ఏదైనా ఒక కళను నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం కళారంగంలో విశేష సేవలందిస్తున్న పలువురు నృత్య గురువులను ఆర్ కృష్ణయ్య శాలువాలతో ఘనంగా సత్కరించి, వారి సేవలను అభినందించారు.