calender_icon.png 7 July, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంగిల్ విఠోబా ఆలయంలో రథోత్సవం

07-07-2025 12:00:00 AM

హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం చుకుని గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ జంగిల్ విఠోబా ఆలయంలో శనివారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్  హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ..

పండరీపురంలోని పాండురంగడిని గుర్తుచేస్తూ ప్రశాం తతకు నెలవుగా జంగిల్ విఠో బా ఆలయనం నిలుస్తోందని చెప్పారు. ఈ ఆలయ నిర్మాణ శైలి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆలయ శిఖరం, మహారాష్ర్టలోని ప్రఖ్యాత పండరీపురం విఠోబా ఆలయ శిఖరానికి ప్రతిరూపంలా ఉంటుంది అని అయ న అన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుం చి వేలాదిగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.