calender_icon.png 7 July, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐఎంసీలో దాశరథి శతజయంతి మహోత్సవం

07-07-2025 12:00:00 AM

ఖైరతాబాద్, జూలై 6: యువభారతి సా హితీ సాంస్కృతిక సంస్థ, ఐఐఎంసీ కళాశా ల, అభ్యుదయ కళా వికాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న ‘తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమం’ తొమ్మిదవ సమావేశాన్ని లకిడికాపూల్‌లోని ఐఐఎంసీ కళాశాలలో నిర్వ హించారు. సభాధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర మాట్లాడుతూ..

ఈ నెల 36 సంస్థలు తమ తో కలిసి తెలుగు వెలుగు కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకు వచ్చాయని తెలియజేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. దాశరథి శత జయంతి ఉత్సవాలను  ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు. ఓయూ తెలుగు శాఖ అధ్యక్షుడు, మూసి సాహిత్య ధార పత్రికా సంపాదకుడు సాగి కమలాకర్‌శర్మ ప్రసంగిస్తూ..

తెలుగు భాషను తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేయడం యువభారతి సంస్థకే దక్కిందన్నారు. ప్రముఖ పత్రికా రచయిత, శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాషానిల యం కార్యదర్శి తిరునగరి ఉడయవర్లు దాశరథి ఉద్యమ జీవితం వ్యక్తిత్వం అనే అంశం పై మాట్లాడారు. నిజాం కళాశాల అధ్యాపకుడు, తెలుగు సినీ కవి తిరునగరి శరత్ చంద్ర దాశరథి సాహిత్య వైభవం అనే అం శంపై మాట్లాడారు. ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడుతూ..

దాశరథి శతజయంతిని పురస్కరించుకొని తమ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యవంలో దాశరథి రచనలపై ఈ నెలలోనే జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం అభ్యుదయ కళా వికాస్ అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ చే రచించబడిన  అగ్నిధార సాహిత్య రూపకాన్ని ప్రదర్శించారు. దాశరధిగా యువభారతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఫణీంద్ర, వట్టికోట ఆళ్వార్ స్వామిగా దత్తాత్రేయశర్మ, ఇతర పాత్రధారులుగా ఉదయ్‌వ ర్మ, సాగర్, గిరీశం, బాలగంగాధర్‌రావు  అభినయించారు.

కెవీఎన్ ఆచార్య నాటక సమన్వయకర్తగా వ్యవహరించారు. యువభారతి వ్యవస్థాపక సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ.. దాశరథిపై శ్రీనివాసాచార్య రచించిన ‘దాశరథి కవితా వైభవం’ పుస్తకం శత జయంతి నాటికి ప్రతి ఇంట్లో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దాశరథి అల్లుడు గౌరీశంకర్, గ్రం థాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, జీడిగుంట వెంకట్రావు, నారాయణరెడ్డి, గిరిప్రసాద్ శర్మ, రామకృష్ణ, శ్యామ్ పాల్గొన్నారు.