7 March, 2026 | 4:18 PM

Breaking News

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •   ఎల్‌పీజీ ధరల పెంపు.. నిరసనకు మమత పిలుపు   •  

బూతులు తిడుతూ వేధిస్తున్న లెక్చరర్‌ను సస్పెండ్ చేయాలి

07-03-2026 12:00 AM

గురుకుల కళాశాల విద్యార్థినుల ఆందోళన

ఉట్నూర్, మార్చి 6 (విజయక్రాంతి): తమతో దురుసుగా వ్యవహరిస్తూ, బూతులు తిడుతూ... చెప్పరాని మాటలతో వేధిస్తున్న ఇంగ్లీషు లెక్చరర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు.

ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా పని చేస్తున్న ప్రత్యూష తీరును నిరసిస్తూ శుక్రవారం విద్యార్థినులు మండుటెండలో బైఠాయించి నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్త్స్ర విజయ్ సంఘటన స్థలానికి చేరుకొని  బాలికలను సముదాయించారు. ఐన విద్యార్థులు వినకపో వడంతో, ఆర్.సి.ఓ  అగస్టీన్ బాలికల వద్దకు చేరుకొని ఆందోళన వివరించాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో,  బాలికలు ఆందోళన విరమించారు.