calender_icon.png 26 September, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థిని

26-09-2025 12:05:14 PM

జడ్చర్ల : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీలకు జడ్చర్లలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల(Gurukul student) విద్యార్థిని ఎంపికైనట్లు ఆ గురుకుల ప్రిన్సిపల్ శ్యామల శుక్రవారం తెలిపారు. ఈ నెల 14వ తేదీన మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో నిర్వహించిన సబ్ జూనియర్ కబడ్డీ సెలెక్షన్స్ లో గురుకులం 10వ తరగతి విద్యార్థిని కె.హేమావతి పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యింది. ఈ నెల 26 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ లో జరిగే సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో ఆడుతోందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని క్రీడలలో రాణించిన వారు అన్ని రంగాలలో రాణిస్తారన్నారు. ఎంపికైన విద్యార్థినినీ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.శాంతికుమార్, ఎంజేపీటీబీసీ ప్రిన్సిపల్ శ్యామల, పీఈటీ అర్షియా మేడం, ఉపాధ్యాయ బృందం అభినందించారు.