calender_icon.png 26 September, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరువు నేలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం

26-09-2025 12:09:28 PM

పాలేరు జలాలతో మోతె మండలానికి మహార్దశ.        

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మోతె:  కరువు నేలను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యం అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. గురువారం మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు పిఎన్ఆర్ గార్డెన్లో జరిగిన నేటిపారుదల శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు సాగునీటి కొరత తీవ్ర స్థాయిలో ఉండటం వలన చాలా వెనుకబడి ఉన్నాయన్నారు.  ఇప్పటి వరకు ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్టు చివరి ప్రాంతమైన మోతే మండలానికి సరైన నీటి సదుపాయం లేదని పాలేరుకు మున్నేరు, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీరు ఎత్తిపోసి పాలేరు నుండి మోతే లిఫ్ట్ ఇరిగేషన్ కు  నీటిని ఎత్తిపోసి మోతే మండలానికి చెందిన 13 గ్రామాల్లో 32,417 ఎకరాలకు మునగాల మండలంలోని 5 గ్రామాలలో 9053 ఎకరాలు, నడిగూడెం మండలంలోని 3 గ్రామాల్లో 5242 ఎకరాలు మొత్తం 46712 ఎకరాలుకు 467 క్యూ సెక్ ల నీటిని 2 మోటార్ల ద్వారా 36 ఎల్, 22 ఎల్ కాల్వలో నీరు ఎత్తిపోసి సాగునీరు సరఫరా చేయటం జరుగుతుందన్నారు. 

ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన 109 ఎకరాల భూ సేకరణ వేగవంతం చేయాలని, భూములు(Lands) కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని,భూసేకరణ అవార్డ్స్ పాస్ అయిన మరుసటి రోజే రైతులకు చెక్కులు మంజూరు చేయాలని ఆర్డిఓ ను మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ 2026 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి 46,712 ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. అనంతరం మోతె మండల కేంద్రం లో  అంగన్వాడీ కేంద్రం ప్రారంభించడం జరిగింది అన్నారి గూడెం నుంచి నాయకన్ గూడెం బి టి రోడ్డు పనులను ప్రారంభించారు.  

ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, జిల్లా నాయకురాలు అరుణ, ఎస్సీ ధర్మ తేజ్, శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారెడ్డి,సామ చిన్న వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మాతృనాయక్, నూకల నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు, మాజీ ఎంపీపీ ముప్పాని ఆశ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య, రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధు రెడ్డి, ఆంగోతు నాగు నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలుగు వీరన్న, ఆయా గ్రామాల అధ్యక్షులు బొక్క ఉపేందర్ రెడ్డి, గడ్డం రామిరెడ్డి, లక్ముడు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.