14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన

18-02-2026 12:31 PM

గురుకుల విద్యార్థినుల ఆందోళన

కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం(Veldanda Mandal) కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. కళాశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేసి సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై(Hyderabad Srisailam Main Road) రాస్తారోకో నిర్వహించారు. కళాశాలలో ప్రిన్సిపాల్ వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు.

నాసిరకమైన భోజనం అందిస్తున్నారని, మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే దూషణలకు గురిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థినులు(Female students)  హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై , ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం(Traffic disruption) కలిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులతో చర్చించి అక్కడినుండి కళాశాల వద్దకు తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.