31 July, 2026 | 8:25 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక నిర్ణయం ఆర్‌వోదే

18-02-2026 01:09 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) బుధవారం విచారణ జరిగింది ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్ణయం ఆర్ వోదేనని హైకోర్టు తెలిపింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై(Ibrahimpatnam Municipal Chairman Election) హైకోర్టు ఇచ్చిన స్టే తొలగించింది. మంచిరెడ్డి తరఫు న్యాయవాది మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరిగిందని తెలిపారు. ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని యాదగిరి తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. ఎన్నికపై హెబియస్ కార్పస్ పిటిషన్ లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టులో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి

బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని(BRS Councilor Akula Yadagiri) పోలీసులు హైకోర్టులో హాజరుపర్చారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు యాదగిరి కోర్టుకు తెలిపారు. తనను బాపట్ల జిల్లా చీరాల తీసుకెళ్లి బౌన్సర్లను పెట్టి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని యాదగిరి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) తరఫున మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఉన్నానని యాదగిరి తెలిపారు. ఈ నెల 16న ఉదయం నుంచి రాత్రి వరకు కారులోనే తిప్పారని వివరించారు. తనకు బీపీ, షుగర్ ఉన్నా భోజనం కూడా ఇవ్వలేదని యాదగిరి(Yadagiri) ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేకపోతే కోరమ్ ఉండదనే తనను తీసుకెళ్లినట్లు కోర్టుకు తెలిపారు. తాను కనిపించకపోవడంతో తన కుమారుడు పిటిషన్ వేశారని యాదగిరి చెప్పారు.