సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో నిషేధిత గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో టౌన్ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం అర్థరాత్రి బేకరీలపై మెరుపు దాడులు నిర్వహించారు. వ్యాపారులు బేకరీల పేరుతో లోపల గుట్కా దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దాడిలో ఓ బేకరీలో రూ.10 లక్షల విలువైన అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు బేకరీ యాజమానిపై కేసు నమోదు చేసి పోలీసు స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.