6 June, 2026 | 10:48 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

వ్యవసాయ బావిలో మృతదేహం.. ముత్తారం మహిళగా గుర్తింపు

14-07-2024 07:25 PM

మంథని : ఓ మహిళను హత్య చేసి ముటకట్టి బావిలో పడేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ముత్తారం-పారుపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గుర్రాల వాగు వద్ద వ్యవసాయ బావిలో జూలై 8వ తేదీన  మహిళ మృతదేహం లభ్యంచింది. దీంతో ఆ మృతదేహం గుర్తించేందుకు మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు వారి  కోణంలో విచారణ చేశారు.

ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డకు చెందిన పెరుక రాజేశ్వరిగా ఆదివారం గుర్తించామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ముత్తారంకు చెందిన రాపెళ్లి అశోక్ రవి సంజీవులు చిన్నమ్మ పెరుక రాజేశ్వరి కనబడటం లేదని ముత్తారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేయగా రాజేశ్వరి ముత్తారం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తున్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.

ఆమె వేసుకున్న దుస్తువుల ఆధారంగా వ్యవసాయ బావిలో ఉన్న మృతదేహం రాజేశ్వరిగా గుర్తించామని, హత్యచేసి శవాని మూటకట్టి బావిలో వేశారని సీఐ పేర్కొన్నారు.  సంఘటన స్థలానికి జాగిలాలతో వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశామని,  మృతికి గల కారణాలు తెలుసుకొని త్వరలోనే హంతకులను గుర్తించి, కఠినంగా శిక్షిస్తామని సీఐ వెల్లిడించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.