18 April, 2026 | 11:16 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

రూ 48 వేల విలువగల గుట్కాలు పట్టివేత

09-09-2024 12:33 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీసులు సోమవారం రూ 48 వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం డీఎస్పీ చంద్రభాన్ ఆదేశానుసారం కొమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక వాహనంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆటో డ్రైవర్ను అదుపులో తీసుకొని విచారించగా లచ్చగూడెం గ్రామానికి చెందిన రేపాకుల చిన్న వెంకటేశ్వర్లు అని తెలిపాడు. అతని వాహనంలో గల మూడు గన్ని బ్యాగుల్లో ఆర్ ఆర్ అంబర్ ప్యాకెట్లు గుట్కాలు లభ్యమయ్యాయి. ఒక్కో బ్యాగులో 40 పెద్ద ప్యాకెట్ల చొప్పున మొత్తం 120 ప్యాకెట్లు ఉన్నాయి. వాటి విలువ రూ 48వేలు ఉంటుంది. ఎవరైనా నిషేధితగుట్కాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సూర్యం ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.