calender_icon.png 19 January, 2026 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుపు మందు తాగి పంచాయతీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం.!

09-09-2024 01:01:12 PM

ఏడు నెలలుగా జీతం రాలేదని మనస్థాపం

జిల్లా ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: తన ఏడు నెలల జీతం ఇవ్వడం లేదని మనస్తాపం చెంది కలుపు మందు తాగి  గ్రామ పంచాయతీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన సూరంపల్లి బాలపీరు (55) అదే గ్రామ పంచాయితీలో ఔట్ సోర్సింగ్లో సఫాయి కార్మికుడిగా పనిచేశాడు. ఏడు నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో పని మానుకున్నాడు. అనంతరం చేసిన జీతం డబ్బులకోసం తిరిగి వేసాగి కల్పమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఇది గమనించిన గ్రామపంచాయతీ కార్యదర్శి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.